Site icon NTV Telugu

ఈటల రాజేందర్ సతీమణి ప్రచారం.. నిలదీసినా?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున గడపగడపకు బీజేపీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. హుజురాబాద్ పట్టణంలోని మామిండ్ల వాడా, గ్యాస్ గోడౌన్ ఏరియా, ఎస్ డబ్ల్యూ కాలనీలలో ముస్లిం మహిళలతో, కార్యకర్తలతో ప్రచారం చేస్తూ రాజేందర్ కి రాబోయే ఎలక్షన్ లో బీజేపీకి ఓటు వేసి లక్ష మెజార్టీతో గెలిపించాలని, రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అయితే, ఇంటి ఇంటి ప్రచారము చేస్తున్న ఈటెల జమునను.. శ్రీనివాస్ అనే వ్యక్తి నిలదీశాడు. గ్యాస్ గోదాం ఏరియకు చెందిన శ్రీనివాస్ కొడుకు 2017లో ఆటల పోటీల కోసం వెళ్లి జైపూర్ లో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సందర్భములో ఈటల ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదని ఆరోపించాడు. అప్పుడు ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగము కల్పిస్తామని చెప్పి.. ఏమి ఇవ్వకుండా మోసం చేసారని జమునను నిలదీశాడు.

Exit mobile version