Etela Rajender: మహిళలకు ఉచిత బస్సు మాత్రం అమలు చేస్తున్నారు. అది కూడా పాత డొక్కు బస్సులతోనే నడిపిస్తున్నారని మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బోడుప్పల్, వివేకానందనగర్ వాసులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగులో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సాధారణంగా మామూలు ఉద్యోగులు ఏమనుకుంటారో నాకు తెలుసు. వారికి రాజకీయాలంటే అంత ఆసక్తి ఉండదన్నారు. వారి వృత్తి, వ్యాపారాలలో బిజీగా ఉంటారు. మేము ఎదురు పడినా అంత పట్టించుకోరన్నారు. ఓట్లప్పుడు మాత్రం అడగడానికి వస్తారన్నారు. సమస్యలు చెప్తే మాత్రం పట్టించుకోరు అని వారు భావిస్తారని అన్నారు. కానీ మీకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, మౌలిక వసతులు కల్పించడానికి రాజకీయ నాయకుల అవసరం ఉంటుంది. కేవలం హామీలను, కులాలను పట్టించుకోకండని తెలిపారు.
Read also: Supreme Court : ‘సీబీఐ కేంద్రం నియంత్రణలో లేదు’.. సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
హామీలు ఇవ్వడం కాదు, అవి ఎంతవరకూ నెరవేరుస్తారు అనేది ఆలోచించాలన్నారు. ఇంత పెద్ద బాద్యతను తలకెత్తుకునే వారికి ఓటు వేసేటప్పుడు ఎవరైతే ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారో వారికే ఓటు వేయాలని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. మహిళలకు, రైతులకు వరాలు కురిపించింది. కానీ వాటిలో ఎన్ని నెరవేరాయి. మహిళా పాలసీలంటూ ప్రతీ మహిళకూ ఎకౌంటులో రూ. 2500 ఇస్తామన్నారు. ఇంతవరకూ ఒక్కరికి కూడా రాలేదన్నారు. ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తానని కూడా చెప్పాడు. అది ఒక్కరికి కూడా ఇంకా చేరలేదు. మహిళలకు ఉచిత బస్సు మాత్రం అమలు చేస్తున్నారు. అది కూడా పాత డొక్కు బస్సులతోనే నడిపిస్తున్నారని మండిపడ్డారు.
Read also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
ప్రధాని మోడీ హయాంలో ఇలాంటి పాలసీలు లేవు, ప్రజలు ఓట్లు వేస్తారా, లేదా, నా ప్రధాని పదవి ఉంటుందా లేదా అని ఆలోచించరు.కేవలం దేశాభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తారు. దానికోసం కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారన్నారు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి వారికి స్వతంత్య్రంగా, ధైర్యంగా జీవించే అవకాశం కల్పించారు. ఒక దేశం, ఒకే చట్టం అన్న నినాదంతో దూసుకుపోతున్నారని తెలిపారు. గతంలో కాశ్మీరులో బాంబుల మోతలు హోరెత్తించేవి. హైదరాబాద్‌లో కూడా స్లీపర్ సెల్స్ ఉండేవారు, బాంబు పేలుళ్లు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. దేశంలోని ఏ సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వారైనా మోదీని తమ సొంత మనిషిగా భావిస్తారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు మోదీ సిద్దాంతాలు ప్రజలందరూ వంటబట్టించుకున్నారని తెలిపారు.
Read also: D. Sridhar Babu: ఉసింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం.. ఐటీ మంత్రి హామీ
ప్రధాని మోడీ బ్రతికితే ప్రజల కోసమే, చనిపోతే ప్రజల కోసమే అని ప్రకటించారని అన్నారు. రాజ్యాంగాన్ని మోడీ మార్చేస్తారని అబద్దపు ప్రచారాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి అతి ఎక్కువ సార్లు రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్ పార్టీనే. అప్పటికప్పుడు అబద్దాలతో ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతోనే వారు ఇలాంటి చెడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం తప్ప ప్రజల కోసం ఆలోచించేది లేదు. ప్రజల ఓట్లకు విలువ కడతారు. దావత్‌లు ఇస్తారు. ప్రలోభాలకు గురిచేస్తారన్నారు. కరోనా సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న నేను స్వయంగా కరోనా పేషంట్ల వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పి ఎందరినో కాపాడాను. ఉద్యమసమయంలో ఎప్పుడూ రోడ్లమీదనే వంటావార్పు, మకాం, జైళ్లు అంటూ తిరిగేవాళ్లం. ప్రజల కాళ్లలో ముల్లు దిగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానని మాట ఇస్తున్నానని ఈటల తెలిపారు.
PM Modi: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోంది