D. Sridhar Babu: సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పెద్ధపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ3 ఏరియా పరిధిలోని ఒసిపి 2 బొగ్గు ఉపరితలగని గేట్ మీటింగ్ లో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్కమ్ టాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు.సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గడ్డం వంశీకృష్ణ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. యువకుడు పారిశ్రామికవేత్త అయిన వంశీకృష్ణ మన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని వంశీకృష్ణకు మద్దతు తెలిపాలని మంత్రి శ్రీధర్ బాబు కార్మికులను కోరారు.
Read also: Ponguleti: కరెంటుని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకున్నావు.. కేసీఆర్ పై పొంగులేటి ఫైర్
అనంతరం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రామగిరిఖిల్లా సమీపంలో ఉపాధిహామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో ఎంపి అభ్యర్థి వంశీకృష్ణతో కలసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రామగిరి ఖిల్లాను పెద్ద పర్యాటక కేంద్రంగా చేస్తామని, ఎన్నికల కోడ్ రాకముందే ప్రతిపాదనలు పంపామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పనిదినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి దఫాలో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఏమైనా సమస్యల ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.
PM Modi: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోంది