NTV Telugu Site icon

Etela Rajender: ఉపఎన్నికల్లో కేసీఆర్ నన్ను చేపను రాకినట్టు రాకిండు.. ఈటల కీలక వ్యాఖ్యలు

Etala Rajender

Etala Rajender

Etela Rajender: ఉపఎన్నికల్లో కేసీఆర్ చేపను రాకినట్టు రాకిండని బీజేపీ పార్టీ గజ్వేల్‌ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఈటల మాట్లాడుతూ.. నేను ఈసారి డబ్బులు ఖర్చుపెట్టే స్థితిలో లేనని అన్నారు. ధైర్య లక్ష్మి మాత్రమే నా దగ్గర ఉందని తెలిపారు. బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారని తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం రాలేదు కాబట్టి మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. మొత్తం తెలంగాణ ఓట్లు వేస్తేనే బీసీ సీఎం సాధ్యం అవుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు ఇస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు. సొంత ఇంటికల నిజం చేస్తామన్నారు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా అందిస్తామన్నారు. నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు. ముసలివాళ్లు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. రైతు కూలీలులకు కూడా 5 లక్షల భీమా అందిస్తామని తెలిపారు. మహిళలకు ఇన్సూరెన్స్ డబ్బులు మేమే కడతామన్నారు.

ఒక్క కేజీ తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం దేశంలో బెల్ట్ షాపులు పెట్టి తాగిపించడంలో తెలంగాణ నంబర్ వన్ అని తెలిపారు. మద్యం మీద ఆదాయం 10,700 కోట్లు ఉంటే 45 వేల కోట్లు అయ్యిందని ఈటల అన్నారు. బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో పుట్టబోయే బిడ్డమీద కూడా లక్ష 25 వేల రూపాయల అప్పుతో పుడుతుందన్నారు. కంచే చేనును మేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఓటు వేసినందుకు మాభూములు గుంజుకున్నారు అని గజ్వేల్ వారు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఆ ఆవేదన తీర్చేందుకే కేసీఆర్ ను ఓడించడానికి వెళ్తున్నానని అన్నారు. నిరుద్యోగుల చావులు ఆగాలన్నారు. పెన్షన్ ఇస్తే సంబరపడుతున్నాం కానీ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనే విషయం మర్చిపోతున్నామన్నారు.
Israel Hamas War: గాజాలోని ఓ ఇంట్లో క్షిపణి దాడి.. ఒకే కుటుంబానికి చెందిన 26మంది మృతి