Site icon NTV Telugu

అపోలోలో చేరిన ఈటల..

Etela Rajender

Etela Rajender

తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు.. ప్రజాదీవెన పేరుతో పాదయాత్రను ఈ నెల 19న కమలాపూర్‌ మండలం నుంచి ప్రారంభించిన ఆయన.. 12వ రోజు వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకుంది. ఇక, ఈటల సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు.. అప్పటికే స్వల్ప దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు.. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఈటలకు బీపీ, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గి, షుగర్‌ లెవల్స్‌ పెరిగినట్లు గుర్తించారు.. ఇక, ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు.. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్య పరీక్షల తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

Exit mobile version