Site icon NTV Telugu

Etela Rajender : ఆనాటి కేసీఆర్‌కు.. నేటి కేసీఆర్‌కు చాలా తేడా ఉంది

Etela Rajender

Etela Rajender

సిద్దిపేటలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, నల్గొండ జిల్లాకు నేను వెళ్తే నాకు అక్కడ ప్రజలు బ్రహ్మరతం పడితే.. కేసీఆర్ చానెల్, పేపర్ ఖాళీ కుర్చీలు చూపించాయి.. ఆ చానెల్‌ని ఎవరూ చూడరు వారు తప్ప అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ కేసీఆర్‌కి నేటి కేసీఆర్‌కి చాలా తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కపుడు కేసీఆర్‌ టీవీలో కనబడితే యువత కేరింత కొడితే నేడు చిదరించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

ఆనాడు సిద్దిపేట పొంగిపోతే నేడు సిద్దిపేట కుంగిపోతోందని, నేను పార్టీ మారలేదు, టీఆర్‌ఎస్‌ వాళ్ళే వెళ్లగొట్టారని ఆయన ఆరోపించారు. నన్ను రాజీనామా చేయాలని రెచ్చ గొడితే ఆత్మ గౌరవం కోసం రాజీనామా చేశాను, నా చరిత్ర మొత్తం పోరాటాల చరిత్ర అని ఆయన వెల్లడించారు. నా అనుకునే వారిని హుజూరాబాద్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి కొన్నారని, పదవుల కోసం పెదవులు ముసే దద్దమ్మలు టీఆర్‌ఎస్‌ వాళ్ళు అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ పోయి బీఆర్ఎస్ వచ్చిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. 8సంవత్సరాల టీఆర్‌ఎస్‌కి ప్రజలు వీఆర్‌ఎస్‌ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారన్నారు.

Exit mobile version