Site icon NTV Telugu

Etela Rajendar : నేనున్నా అని పేదలకు అండగా ఉండేది బీజేపీ

Etela Rajender

Etela Rajender

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు రెండో రోజు హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటుల చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన వ్యాఖ్యానించారు. నేనున్నా అని పేదలకు అండగా ఉండేది బీజేపీ అని ఆయన కొనియాడారు. అంతేకాకుండా దళిత..గిరిజనుల కు అండగా ఉండి… రాష్ట్రపతి నీ చేస్తుంది బీజేపీ అని ఆయన తెలిపారు.

దళిత జాతిని సీఎం చేస్తా అని మోసం చేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చే రాష్ట్రం తెలంగాణ అని మోడీ మీటింగులో చెప్పారన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని మోడీ చెప్పారన్నారు. కేసీఆర్‌నీ ఖచ్చితంగా ఓడగొట్టాలన్నారు. కాంగ్రెస్ చచ్చిపోయిందంటూ ఈటల వ్యాఖ్యానించారు. అంతరించి పోతుంది కాంగ్రెస్ అని.. . కాంగ్రెస్‌కి ఓటేస్తే.. టీఆర్‌ఎస్‌కి వేసినట్టే అని ఆయన తెలిపారు.

 

Exit mobile version