NTV Telugu Site icon

Errabelli Dayakar Rao : కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

సీఎం కేసీఆర్‌ నిన్న యాసంగి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోళు చేస్తుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లపై కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం జనగామ కలెక్టరేట్‌ రైస్‌మిల్లర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అత్యంత కష్ట, క్లిష్ట సమయంలోనూ సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. రూ.3వేల కోట్ల నష్టాన్ని సైతం లెక్కచేయకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్రం సహకరించకున్నా.. గతంలో వడ్లను కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పటికీ.. కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే రైతు పక్షపాతిగా సీఎం మరోసారి ధాన్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ప్రజలు, ప్రత్యేకించి రైతులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు, అధికారులు, మిల్లర్లు, హమాలీలు ప్రభుత్వానికి సహకరించాలని, సమన్వయం, పరస్పర సహకారంతో పని చేయాలని, రూ.1,960 మద్దతు ధరతో గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తామని వెల్లడించారు. ప్రతి రైతుకు టోకెన్లు ఇచ్చి.. క్రమపద్ధతిలో కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలని, ప్రణాళికతో కొనుగోలు చేయాలన్నారు.

Corona : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 23 మంది విద్యార్థులకు పాజిటివ్‌..