NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: ప్రీతి ఘటనపై బీజేపీ వాళ్లు లేని తగాదాలు సృష్టిస్తున్నారు

Errabelli On Preethi Case

Errabelli On Preethi Case

Errabelli Dayakar Rao Reacts On Warangal Medico Preethi Case: వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై బీజేపీ వాళ్లు అనవసరమైన తగాదాలు సృష్టిస్తున్నారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ప్రీతిని సైఫ్ వేధించాడని విచారణలో తేలిందని.. వేధింపుల కారణంగానే ఆ అమ్మాయి ఇలంటి నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ఆ యువతికి వైద్యులు మంచి వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఆ అమ్మాయికి ఇదివరకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. సైఫ్‌కి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సైఫ్ వేధింపుల వల్లే ఇలా జరిగిందని, దీనిని రాజకీయం చేయొద్దని, కావాలని రెచ్చగొట్టొద్దని కోరారు. ప్రీతి కుటుంబ సభ్యులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రీతి తనకు బిడ్డ లాంటిదని మంత్రి వెల్లడించారు.

KA Paul: వైఎస్సార్, సోనియా నన్ను చంపేందుకు ప్రయత్నించారు.. కేఏ పాల్ సంచలనం

ఇదిలావుండగా.. ప్రీతిని సైఫ్ కావాలనే వేధించినట్టు వాట్సప్ చాట్స్ ద్వారా తేలిందని సీపీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి మానసికంగా ఇబ్బందులు పడిందని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని స్పష్టం చేశారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడడానికి ముందు ప్రీతి గూగుల్‌లో సక్సీ నైల్ కోలిన్ అనే ఇంజక్షన్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తేలిందన్నారు. బ్లడ్ శాంపిల్స్ తీశామని, టాక్సికాలజీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణంగా ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపిన ఆయన.. ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ రంగు పులమొద్దని కోరారు. సైఫ్‌కు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదన్నారు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. వాట్సప్ గ్రూపుల్లో సైఫ్ ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేశాని, బుర్ర తక్కువ ఉందని ఇబ్బందులకు గురి చేశాడని అన్నారు. ప్రీతి ప్రశ్నించే తత్వాన్ని సహించలేక.. సైఫ్ వేధించినట్లు తేలిందన్నారు.

Trivikram: పూజాకు రెండు కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్..?