NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: దేశానికి గాంధీ స్వతంత్రం తెస్తే.. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao Praises CM KCR: భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మహాత్మా గాంధీతో అయితే.. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చామని చెప్పే అర్హత లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. జనగామ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణత్యాగలు చేసి సాధించిన తెలంగాణ అభివృద్ధి చెందిందా? లేదా? అనేది ఆలోచించుకోవాలని సూచించారు. కొందరు మూర్ఖులు వివిధ రకాలుగా మాట్లాడుతున్నారని.. వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Parshottam Rupala: తెలంగాణలో అభివృద్ధి సాధించాలంటే.. బీజేపీని గెలిపించాలి

గత 70 ఏళ్ళ పాలనలో తెలంగాణ ఎంతో ఆగమైందని.. తెలంగాణ వచ్చాకే అద్భుతమైన విజయం సాధించామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణ రావడంతోనే నేడు రైతుల భూముల రేట్లు గణనీయంగా పెరిగాయన్నారు. 1972లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 369 మందిని కాంగ్రెస్ పార్టీ తుపాకులతో కాల్చి చంపి పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. ఆ తర్వాత 12 వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకోని అమరులైతేనే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ అమరవీరుల మరణాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని ధ్వజమెత్తారు. కానీ.. ఆ కాంగ్రెస్ నాయకులే నేడు అమరులకు నివాళులు అర్పించడం సిగ్గుచేటుగా ఉందని దుయ్యబట్టారు. తెలంగాణ సాధనలో అమరవీరుల పాత్ర ఎంతో కీలకమైనదని.. వారి ప్రాణత్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.

Bandi Sanjay: బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటి కాదు.. బిఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటే!

గత 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో.. అమరవీరుల కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌కు ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా జరుపుకున్నామని.. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత ఉన్న తేడాలను వివరిస్తూ గత 22 రోజులుగా ప్రజల్లో అవగాహన కల్పించామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏం కావాలని కోరుకుని బలిదానాలకు పాల్పడ్డారో.. అవన్నీ సీఎం కేసీఆర్‌ వల్ల సాధ్యమయ్యాయని అన్నారు. అమరవీరుల కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.