Errabelli Dayakar Rao: మోదీని గద్దె దింపడమే కేసీఆర్ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి కౌంటర్లిచ్చారు. అవగాహన లేకుండా, చరిత్ర తెలియకుండా, మోదీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పదవికి తగ్గట్టుగా లేవన్నారు. మోదీకి కుటుంబం లేదని, అందువల్లే ఆయనకు సెంటిమెంట్లు తెలియవని అన్నారు. సీఎం కేసిఆర్‌ది కుటుంబ పాలన కాదని చెప్పిన ఎర్రబెల్లి.. తెలంగాణ కోసం ఆయన కుటుంబం ఉద్యమించి, జైళ్ళకు పోయి, త్యాగాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని అవమానించడమంటే.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని ఎర్రబెల్లి చెప్పారు.
తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో కించపరిచిన మోదీ.. తెలంగాణ ప్రజల్ని నూకలు తినమని అవమాన పరిచారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. తెలంగాణకు నయా పైసా ఇవ్వకుండా వివక్ష చూపిస్తూనే ఉన్నారని.. ఇప్పుడు వచ్చి తెలంగాణపై కపట ప్రేమ చూపిస్తే ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. తెలంగాణ పై వివక్ష చూపడం, విషం చిమ్మడం, విద్వేషంతో మాట్లాడటమే మీ పనా? అయితే మతం లేకపోతే ప్రాంతాల పేరుతో ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో మీరు గెలిస్తే.. తెలంగాణ అభివృద్ధి చేసి మళ్ళీ కేసీఆర్ ఎన్నికల్లో గెలిచారన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టనవి కూడా అమలు చేశామని చెప్పారు. వడ్లు కొనుగోలు ఆలస్యం కావడానికి బీజేపీనే ప్రధాన కారణమన్నారు.
Also Read
ఒక్క మెడికల్ కాలేజి తెలంగాణకి ఇచ్చారా? బ్యాంక్‌లను ముంచినోళ్ళని పట్టకువచ్చారా? అని నిలదీసిన ఎర్రబెల్లి.. దేవుని మీద గౌరవం ఉంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీనే పాలిత రాష్ట్రాల్లో కుటుంబ పాలన కొనసాగిస్తోందని.. అంబానీ, అదానిల కోసమే ఆ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. మోదీని గద్దె దింపడానికి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని.. మోదీని గద్దె దింపడమే ఆయన ఏకైక లక్ష్యమని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణం టీమ్?
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!