Former MLA Eravathri Anil Made Comments on Telangana Congress Leaders.
కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశంపై గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ విప్ ఈరవర్తి అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రోజు రోజుకు రాష్ట్రంలో బలపడుతుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసామంటే పార్టీ ఎంత బలంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చునని, రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్ళిందని ఆయన అన్నారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలను నియమించారని, వారిని వ్యతిరేకిస్తే అధిష్టానాన్ని వ్యతిరేకించినట్టేనని ఆయన అన్నారు. కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ సక్సెస్ కాగానే మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో సమావేశం పెట్టారు.
ఇప్పుడు మళ్లీ వి.హెచ్ మీటింగ్ ఇలాంటి వాటి వల్ల పార్టీ లో కార్యకర్తలు చాలా సఫ్ఫార్ అవుతున్నారు. ఇప్పటివరకు చాలా పదవులు అనుభవించిన వారు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఎలా.. అని ఆయన అన్నారు. ఏదో రకంగా పార్టీలో చిచ్చు పెట్టి పార్టీని బలహీనం చేసే పరిస్థితి కనిపిస్తుందని, జగ్గారెడ్డి, వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి లు ఆలోచించుకోవాలని మీకు ఏదైనా పార్టీలో సమస్యలు ఉంటే గాంధీభవన్ లో చర్చించుకోవాలన్నారు. వీహెచ్ ఒక ఎమ్మెల్సీ ద్వారా హరీష్ రావు ను కలవాల్సిన పని ఏందని, కాంగ్రెస్ అధిష్టానానికి ఒక వినతి చేస్తున్నాం.. వీహెచ్, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేస్తుంటే వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు.
