Site icon NTV Telugu

Yadadri Power Plant: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన భట్టి విక్రమార్క..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Yadadri Power Plant: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రుల బృందం శనివారం పవర్ ప్లాంట్‌ను సందర్శించింది. విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు చేరుకున్నారు. వీరికి సీఎండీ రిజ్వీ, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి స్వాగతం పలికారు. ముందుగా ప్లాంట్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎండీ అతిథి గృహంలో ప్రాజెక్టు పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

Read also: Queen 2 : ‘క్వీన్’ సీక్వెల్‌కు కథ సిద్ధం..సీక్వెల్ లో కంగనా నటిస్తుందా..?

ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రాజెక్టు పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రానున్న కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అవకతవకలు, ఇంకా ఎంత మందికి పరిహారం అందాల్సి ఉందని మంత్రులు ఆరా తీశారు. మరోవైపు 800 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి చేసే 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్లలో ఈ ఏడాది చివరి నాటికి రెండు యూనిట్లను అందుబాటులోకి తెస్తామని జెన్‌కో సీఎండీ రిజ్వీ ప్రకటించారు. తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) యాదాద్రి థర్మల్ ప్లాంట్ పై ఈ నెల 20న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది.
UP : అతను ఊరికి పెద్ద మనిషి.. ఉద్యోగం ఇస్తానంటూ మూడేళ్లుగా అత్యాచారం..చివరకు

Exit mobile version