Cyber Frauds: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. ప్రజల్ని బురిడీ కొట్టించి డబ్బులు దోచేయాలనే ఉద్దేశంతో పూటకో కొత్త ఐడియా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు అంటూ కొందరు మోసాలకు పాల్పడుతుంటే.. మరొకరు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు ఆశ చూపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీటిని నమ్మిన వారందరికి నుంచి దొరికిన కాటికి దోచుకుంటున్న ఘటనలు హైదరాబాద్ లో రాను రాను పెరుగుతూనే ఉన్నాయి. వీరి బారిన బడిన కొందరు బాధితులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే భాగ్యనగరంలో చోటుచేసుకుంది. ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Read also: Vijay Thalapathy : విజయ్ తమిళంలోకి రీమేక్ చేసిన తెలుగు సినిమాలు ఏవో తెలుసా?
ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతూ 3 రోజుల్లో రూ. 5 కోట్ల రూపాయలకు సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో బాధితులకు రూ. 2.5 కోట్లకు పైగా టోకరా పెట్టారు. అంతేకాకుండా.. కొందరు బాధితులకు లింక్ పంపుతూ ట్రేండిగ్ అంటూ వాళ్లను మాటలు కలిపి వారికి ఓటీపీ వస్తుందని నమ్మబలికారు. అంతేకాకుండా ఆ ఓటీపీని చెబితే మీరు భారీగా డబ్బులు అకౌంట్ లో పడాయంటూ నమ్మించారు. దీంతో బాధితులు వారికి వచ్చిన ఓటీపీ చెప్పగానే ఖాతాల నుంచి నగదు మాయం చేస్తున్నారు. దీంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో కేసులో ఓ కంపెనీ ఈ-మెయిల్ హ్యాక్ చేసి రూ. 22 లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు. లక్నోకు చెందిన పలువురిని చీటింగ్ చేస్తున్న వారిని అదుపులో తీసుకున్నారు. బాధితుల్లో న్యాయవాదులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులకు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడటం గమనార్హం అని పోలీసులు చెబుతున్నారు.
Aattam : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ ‘ఆట్టం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?