Kamareddy Master Plan: నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం.. నేటి ఆందోళనకు రైతులు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy Master Plan: నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు తీర్మానం, డిటిసిపి ఢిల్లీ కన్సల్టెన్సీ పై ప్రభుత్వానికి పిర్యాదు వంటి అంశాలే ఎజెండా చర్చ నిర్వహించనున్నారు. కౌన్సిలర్ల వరుస రాజీనా మాలు, ఎమ్మెల్యే ఇంటి ముట్టడి పిలుపుతో మున్సిపల్ చైర్మన్ నిట్టూ జాహ్నవి అత్యవసర సమావేశం ఏర్పాటుకు చేశారు.
ఆందోళనకు తాత్కాలిక బ్రేక్
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రకటనతో ఇవాళ ఆందోళనకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఎం.ఎల్.ఏ. ఇంటి ముట్టడి వాయిదా వేశారు. మున్సిపల్ పాలకవర్గ సమావేశం ఏర్పాటు ప్రకటనతో రైతులు శాంతించారు. నేడు అడ్లూర్ కృష్ణా మందిరం ఆవరణలో రైతు జే.ఏసీ సమావేశం, బాధిత గ్రామాల రైతులు హాజరుకానున్నారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రకటన, భవిష్యత్ కార్యా చరణ పై రైతులు చర్చించనున్నారు. ఉద్యమానికి రైతులు తాత్కాలిక విరామం ఇచ్చారు.
నిన్నటితో కౌన్సిలర్ల రాజీనామాలకు డెడ్ లైన్ పడింది. పలువురు కౌన్సిలర్ల రాజీనామా చేయగా.. రాజీనామా చేయకపోతే కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడిస్తామని ఇవాళ కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి జేఏసీ పిలుపు రైతు జేఏసీ చెప్పిన విషయం తెలిసిందే.. దీంతో రైతులు ఏంచేస్తారనేది కౌన్సిలర్లలలో టెన్షన్ మొదలైంది. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా మున్సిపల్ కమీషనర్ కు తమ రాజీనామాలు ఇద్దరు కౌన్సిలర్లు సమర్పించారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీకి కౌన్సిలర్లు శ్రీనివాస్, రవి తమ రాజీనామా పత్రాలందించారు. మిగిలిన ఆరు విలీన గ్రామాల కౌన్సిలర్లు 19 లోపు రాజీనామాలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు రైతులు. రాజీనామా చేయకపోతే కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయించాలని ఎమ్మెల్యేకు జేఏసీ సమావేశం ద్వారా రైతులు మెసేజ్ పంపించారు. లేకుంటే.. ఇవాళ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. ఓవైపు కౌన్సిలర్లు, ఇంకోవైపు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై ఒత్తిడితో కామారెడ్డిలో ఉత్కంఠ కొనసాగుతుంది.
Read also:MLA Raja Singh: దానిపై వివరణ ఇవ్వండి.. రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో భూమి పోతుందనే బాధతో రాములు ఆత్మహత్య చేసుకోవడంతో రైతు జేఏసీ ఆందోళనను సీరియస్‌గా తీసుకుంది. ఈ నెల 5న కలెక్టరేట్‌ను ముట్టడించారు. మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే కలెక్టర్ దీనిపై క్లారిటీ ఇచ్చినా అయినా రైతులు వెనక్కు తగ్గలేదు. మా భూములు కావాల్సిందే అంటూ ఆందోళనలు చేపట్టారు. రైతుల ఆందోళన బ్రేక్ పడకపోవడంతో.. నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది. దీంతో రైతులు నేటి ఆందోళనకు బ్రేక్ వేశారు. అయితే మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏం మాట్లాడుతారు అనేది ఉత్కంఠంగా మారింది. రైతులకు సమావేశం అనంతరం ఆందోళన కొనసాగిస్తారా? అనేది చర్చకు దారితీస్తోంది.
Ramgopalpet Fire Accident: అదుపులోకి రాని మంటలు.. భవనం కూల్చివేసేందుకు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!