NTV Telugu Site icon

Kamareddy Master Plan: నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం.. నేటి ఆందోళనకు రైతులు బ్రేక్

Kamareddy Master Plan

Kamareddy Master Plan

Kamareddy Master Plan: నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు తీర్మానం, డిటిసిపి ఢిల్లీ కన్సల్టెన్సీ పై ప్రభుత్వానికి పిర్యాదు వంటి అంశాలే ఎజెండా చర్చ నిర్వహించనున్నారు. కౌన్సిలర్ల వరుస రాజీనా మాలు, ఎమ్మెల్యే ఇంటి ముట్టడి పిలుపుతో మున్సిపల్ చైర్మన్ నిట్టూ జాహ్నవి అత్యవసర సమావేశం ఏర్పాటుకు చేశారు.

ఆందోళనకు తాత్కాలిక బ్రేక్

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రకటనతో ఇవాళ ఆందోళనకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఎం.ఎల్.ఏ. ఇంటి ముట్టడి వాయిదా వేశారు. మున్సిపల్ పాలకవర్గ సమావేశం ఏర్పాటు ప్రకటనతో రైతులు శాంతించారు. నేడు అడ్లూర్ కృష్ణా మందిరం ఆవరణలో రైతు జే.ఏసీ సమావేశం, బాధిత గ్రామాల రైతులు హాజరుకానున్నారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రకటన, భవిష్యత్ కార్యా చరణ పై రైతులు చర్చించనున్నారు. ఉద్యమానికి రైతులు తాత్కాలిక విరామం ఇచ్చారు.

నిన్నటితో కౌన్సిలర్ల రాజీనామాలకు డెడ్ లైన్ పడింది. పలువురు కౌన్సిలర్ల రాజీనామా చేయగా.. రాజీనామా చేయకపోతే కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడిస్తామని ఇవాళ కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి జేఏసీ పిలుపు రైతు జేఏసీ చెప్పిన విషయం తెలిసిందే.. దీంతో రైతులు ఏంచేస్తారనేది కౌన్సిలర్లలలో టెన్షన్ మొదలైంది. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా మున్సిపల్ కమీషనర్ కు తమ రాజీనామాలు ఇద్దరు కౌన్సిలర్లు సమర్పించారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీకి కౌన్సిలర్లు శ్రీనివాస్, రవి తమ రాజీనామా పత్రాలందించారు. మిగిలిన ఆరు విలీన గ్రామాల కౌన్సిలర్లు 19 లోపు రాజీనామాలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు రైతులు. రాజీనామా చేయకపోతే కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయించాలని ఎమ్మెల్యేకు జేఏసీ సమావేశం ద్వారా రైతులు మెసేజ్ పంపించారు. లేకుంటే.. ఇవాళ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. ఓవైపు కౌన్సిలర్లు, ఇంకోవైపు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై ఒత్తిడితో కామారెడ్డిలో ఉత్కంఠ కొనసాగుతుంది.

Read also:MLA Raja Singh: దానిపై వివరణ ఇవ్వండి.. రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు నోటీసులు

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో భూమి పోతుందనే బాధతో రాములు ఆత్మహత్య చేసుకోవడంతో రైతు జేఏసీ ఆందోళనను సీరియస్‌గా తీసుకుంది. ఈ నెల 5న కలెక్టరేట్‌ను ముట్టడించారు. మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే కలెక్టర్‌ దీనిపై క్లారిటీ ఇచ్చినా అయినా రైతులు వెనక్కు తగ్గలేదు. మా భూములు కావాల్సిందే అంటూ ఆందోళనలు చేపట్టారు. రైతుల ఆందోళన బ్రేక్‌ పడకపోవడంతో.. నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది. దీంతో రైతులు నేటి ఆందోళనకు బ్రేక్‌ వేశారు. అయితే మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏం మాట్లాడుతారు అనేది ఉత్కంఠంగా మారింది. రైతులకు సమావేశం అనంతరం ఆందోళన కొనసాగిస్తారా? అనేది చర్చకు దారితీస్తోంది.
Ramgopalpet Fire Accident: అదుపులోకి రాని మంటలు.. భవనం కూల్చివేసేందుకు..

Show comments