Elevator Accident: లిప్ట్ లో పడి మహిళ మృతి.. అంతా గప్ చిప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elevator Accident: ఖమ్మం నగరంలో ప్రవేటు ఆసుపత్రుల కంట్రోల్ లోనే జిల్లా అదికారులు, పోలీసు యంత్రాంగం ఉన్నదంటే దానికి నిదర్శనం ఈ లిప్టులో పడి చనిపోయిన మహిళ కేసు. ఈకేసుకు సంబందించి పోలీసులు ఆ ఆసుపత్రి వైపు వెళ్లలేదు సరికద కనీసం కేసు కూడ పెట్టలేదు. రాత్రి జరిగినవ్యవహారంలో అంత గప్ చిప్ అయిపోవడంపై పలు చర్చలకు దారితీస్తోంది.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది. పట్టణంలోని నడి సెంటర్ లో ఉన్న ఓ ప్రవేటు ఆసుపత్రిలో తన బందువులను చూడడానికి వైరా మండలం గొల్లెన పాడుకు చెందిన ప్రమీల అనే మహిళ వచ్చింది. తమ బందువులను చూసిన తరువాత తిరిగి వెళుతుండగా లిప్ట్ వద్ద ఆగింది. లిప్టు డోర్ తెరిచింది. అయితే క్రింద ఉన్న లిప్టు మాత్రం పైకి రాలేదు. డోర్ తెరుచుకున్నప్పటికి డోర్ మాత్రం పైకి రాకపోవడానికి లిప్ట్ సమస్యల్లో ఉన్నదని అర్ధం కాని ఆమెకు మాత్రం అది తెలియలేదు. దీంతో కాలును లిప్టు లోపలికి పెట్టడంతో ఆమె లిప్టులో పడి పోయింది. ఆమె వెనకాలే మరో మహిళ కూడ లిప్టు లో కాలు పెట్టవలసి ఉంది. కాని ముందు వెళ్లిన మహిళ ప్రమీల పడిపోవడంతో ఆమె వెనకంజు వేసింది. అయితే లిప్టు క్రిందకు వెళ్లి చూడడంతో ప్రమీల గాయల పాలు అయ్యింది చనిపోయింది. అయితే ఈఘటనపై యాజమాన్యం, మహిళ బందువులు రాజీకి వచ్చినట్లు సమాచారం.
Also Read
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
కేసు ఏమి లేకుండా మహిల కుటుంబసభ్యులతో మాట్లాడారు. విషయం తెలిసి కొంత మంది బయట వ్యక్తులు కూడ వచ్చారు. వారిని కూడ ఆసుపత్రి యజమాన్యం మచ్చిక చేసుకుంది. ఎటువంటి గొడవ జరుగకుండా అందరిని మేనేజ్ చేసుకుంది. మృతదేహాన్ని గప్ చిప్ గా మృతి చెందిన మహిళ మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. అక్కడ అంత్యక్రియలు జరిగాయి. అయితే ఈవిషయం సమాచారం అందుకున్న మీడియా, వీడియోల సహా మీడియాలో ప్రసారం చేశారు. అయినప్పటికి ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన అధికారులు కాని, వైరా మండలంకు చెందిన అధికారులు కాని స్పందించలేదు. కనీసం పోస్టు మార్టమ్ చేయించడానికి అధికారులు ప్రయత్నాలు చేయలేదు. ఏమి జరుగలేదనట్లుగా అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అర్దరాత్రి జరిగిన ఘటనపై ఖమ్మం నగరంలో పోలీసు డిపార్ట్ మెంట్ కాని, వైద్య ఆరోగ్య శాఖ కాని స్పందించలేదు. అంతా గప్ చిప్ అయ్యారు. అందరిని మేనేజ్ మెంట్ చేయడంలో ఆ ఆసుపత్రి యజమాన్యం మాత్రం సపలీకృతం అయ్యింది. కాని మహిళ లిప్ట్ లో పడ్డ విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంత చేస్తున్నప్పటికి అధికారులు మాత్రం స్పందించక పోవడంతో.. పలు చర్చలకు దారితీస్తోంది.
Nanamuri Balakrishna: బాహుబలి రేంజ్ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!