ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. ఆ బస్సులో ఉన్న ఓ మహిళ మృతిచెందడంతో పాటు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అచ్యంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు… కల్వకుర్తి నుంచి అచ్చంపేట వైపు వెళ్లే సమయంలో ప్రమాదానికి గురైంది.. బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. బస్సులో ఉన్న నర్సమ్మ (50)అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందారు.. మరో ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా మారడంతో.. వారిని హైదరాబాద్‌కు తరలించారు.. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల.. దర్యాప్తు ప్రారంభించారు.
ఆర్టీసీ బస్సును తాకిన విద్యుత్ వైర్లు, మహిళ మృతి, ఇద్దరికి సీరియస్

RTC Bus