NTV Telugu Site icon

Electric Bike Explosion: పేలిన ఎల‌క్ట్రిక్ వాహ‌నం! ఇల్లు దగ్ధం

Suryapet

Suryapet

తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే ఇలాంటి ఘటనలు వాటిని కొనుగోలు చేయాలనుకున్న మిగతా వారిలో భయాన్ని పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంల పెద్ద చీకోడు గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండ‌లం పెద్ద‌చీకోడు గ్రామంలో పుట్ట ల‌క్ష్మీనారాయ‌ణ అనే వ్య‌క్తి కొద్ది రోజుల క్రితం ఎల‌క్రిక్ వాహ‌నాన్ని కొనుగోలు చేసాడు. రోజు మాదిరిగానే ఎల‌క్ట్రిక్ బైక్ ను ఇంటి ముందు చార్జింగ్ లో పెట్టాడు. బైక్ పేలి పెద్ద శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసారు. దీంతో ప్రాణాప్రాయం త‌ప్పింది. ఎల‌క్ట్రిక్ బైక్ పేలడంతో ఇండ్లు పూర్తిగా కాలిబూడిదైంది. పెట్రోల్ ధ‌ర‌లు మండిపోతుండుటంతో ఎల‌క్ట్రిక్ బైక్ కొనుగులోలు చేసి .. ఇంటినే కోల్పోయాన‌ని, నిల‌వ‌నీడ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

కాగా.. 2022 మే 10న ఇలాంటి ఘ‌ట‌నే కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో చోటుచేసుకుంది. రామచంద్రాపూర్‌కు చెందిన ఎగుర్ల ఓదేలు తన ఎలక్ట్రిక్‌ వాహనానికి ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోయారు. అర్ధరాత్రి బ్యాటరీ పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. నిద్రిస్తున్న వారంతా అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ప్ర‌ణాప్రాయం త‌ప్ప‌డంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

పదకొండు నెలల కిందట కొనుగోలు చేసిన బెన్లింగ్‌ ఫాల్కన్‌ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని నిత్యం ఉపయోగిస్తున్నామని, మరో నెల పాటు వారంటీ ఉందని బాధితుడు తెలిపారు. సంబంధిత కంపెనీ యాజమాన్యం బాధితునికి కొత్త వాహనాన్ని అందజేసిన విషయంతెలిసిందే. అయితే ఈ వాహనాలు వరుసగా కాలిపోతుండటంతో వాహనాదారుల్లో భయాందోళనకు గురవతున్నారు. కాలిపోవడమే కాకుండా దానివల్ల ఆస్తినష్టం జరుగుతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Ropeways In The City: ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా రోప్‌వే మార్గాలు.. అక్క‌డ ప్ర‌త్యేకం