Padi Kaushik Reddy: దయచేసి ఎమ్మెల్యేగా ఒక్క సారి అవకాశం ఇవ్వండి ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి, కనగర్తి, మల్యాల, లక్ష్మాజిపల్లి గ్రామాల్లో ప్రచారంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బై ఎలక్షన్ లో ఇక్కడి ఎమ్మెల్యే గెలిచి రెండేళ్లు అయిందన్నారు. కనీసం తట్టేడు మట్టి అన్న ఇక్కడ పోసిండా? అని ప్రశ్నించారు. ఇల్లందకుంట మండలం అవుతుందని ఇక్కడి ప్రజలు అనుకున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లందకుంటను మండలం చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇల్లందుకుంట ప్రజలకు 5 హామీలు ఇచ్చారు. 1. తాను గెలిచిన తర్వాత ఇల్లందకుంటను టెంపుల్ సిటీ చేస్తా అన్నారు. 2. తాళ్ళల్లో మంచి రిసార్ట్ ఏర్పాటు చేపిస్తా అని తెలిపారు. 3. రిజర్వాయర్ ను మంచి టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేస్తా అన్నారు. 4. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. 5. కరీంనగర్ లో లాగ ఇక్కడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కట్టిస్తామని తెలిపారు. దయచేసి ఎమ్మెల్యేగా ఒక్క సారి అవకాశం ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు నేటివరకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మనసులు గెలుచుకున్నాడని అన్నారు. తెలంగాణ అధినేత కేసీఆర్ వెంటే రాష్ట్ర ప్రజలు ఉన్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నిక ఇంకా 28 రోజులు మాత్రమే మిగిలి ఉందని, 28 రోజులు కాలికి బట్ట కట్టకుండా తిరిగి భారీ మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీ గెలిపించాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం లో లక్ష మెజారిటీకి తగ్గకుండా చూసుకోవాలన్నారు. 28 రోజులు నాకోసం కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతానని ఆయన అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బిఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని, కాంగ్రెస్ రన్ అవుట్, బీజేపీ డకౌట్ అవుతుందని అన్నారు. తెలంగాణలో మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైదరాబాద్లో జరిగే ప్రతి ఎన్నికల్లో మీ ముందు నీ నుండి గెలిపించుకుంటానని అన్నారు.
Poultry Farming : మాంసపు కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..