Site icon NTV Telugu

National Integrations Celebrations: సమైక్యతా వజోత్సవాలకు ఏర్పాట్లు చేయండి.. సీఎస్ ఆదేశం

National Integrations Celebrations

National Integrations Celebrations

కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో డీజీపీతో మహేందర్‌రెడ్డితో కలిసి CS సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 16, 17,18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వక్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని CS అధికారులను ఆదేశించారు. భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రేపటి నుంచి (16)వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలన్నారు.

Read also:National Integrations Celebrations: సమైక్యతా వజోత్సవాలకు ఏర్పాట్లు చేయండి.. సీఎస్ అధికారులను ఆదేశం

17న హైదరాబాద్‌లో ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగువేస్తారని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ పంచాయతీ ప్రధాన కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. నగరంలో జరిగే ఆదివాసీ, బంజారా భవన్‌ల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున గిరిజనులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, అదేరోజు స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులకు సన్మానాలు నిర్వహించాలన్నారు.
Ap Crime: కుమార్తెకు తన పోలికలు రాలేదని.. తండ్రి దాష్టీకం

Exit mobile version