రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సాధారణ జీవనం ప్రారంభం అయింది. దీంతో జులై 1 వ తేదీనుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాలేజీలు తిరిగి రీ ఓపెన్ చేశారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో విద్యాశాఖ అధికారుతలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమీక్షను నిర్వహించబోతున్నారు. విద్యాసంస్థలు, ఆన్‌లైన్ క్లాసులు, మార్గదర్శకాలపై సమీక్షించబోతున్నారు. అదేవిధంగా, జులై నెలలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు జరగాల్సి ఉన్నది. ఈ పరీక్షలపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
విద్యాశాఖ అధికారులతో మంత్రి సబిత కీలక సమీక్ష…
