Site icon NTV Telugu

TSPSC Paper Leak: నేడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించనున్న ఈడీ

Tspsc

Tspsc

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచలగూడా జైల్లో ఈడీ విచారించనుంది. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించి నిందితులను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. కాగా.. నాంపల్లి కోర్టు ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి అనుమతించింది. ఇవాల ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు అధికారులు. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి నాంపల్లి కోర్టు ఆదేశించింది. జైలుకు ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, మొబైల్స్ లను నాంపల్లి కోర్టు అనుమతించింది. జైలు సూపర్ డెంట్ కు ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలనీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. నలుగురు ఈడీ బృందం వెళ్లి విచారించడానికి అనుమతించింది. మనీ లాండరింగ్ కోణంలో ఇద్దరు నిందితులను ఈడీ విచారించనుంది. ఈరోజు, రేపు చంచలగూడ జైల్లోనే వాంగ్మూలం ఈడీ నమోదు చేయనుంది. ఈ కేసులో నిందుతుడు ప్రవీణ్‌ నుంచి తాజాగా మరికొన్ని వివరాలు రాబట్టేందుకు అనేక ప్రశ్నలను ఈడీ సంధిస్తోంది.

Read also: Rangareddy Crime: షాద్‌ నగర్‌ లో కిడ్నాప్‌.. గచ్చిబౌలిలో హత్య

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత నెల 23న మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఇడి అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను రెండు రోజుల పాటు కస్టడీకి ఈడీ అనుమతించింది. వీరిని చంచల్‌గూడ జైలులో అధికారులు విచారించనున్నారు. విచారణలో భాగంగా టీఎస్ పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని ఇప్పటికే ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Exit mobile version