NTV Telugu Site icon

ED raids in Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం..

Ed

Ed

ED raids in Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి 15 బృందాలుగా విభజించి సోదాలు నిర్వహిస్తున్నారు. పటాన్ చెరు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి సహా 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలు ఎందుకు చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ప్రతినెలా హైదరాబాద్‌లో ఎక్కడో ఒకచోట ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి.

Read also: Bangalore: కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారం

కొద్దిరోజుల క్రితం నగరంలోని దాదాపు 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వివిధ కన్సల్టెన్సీ సంస్థల్లో తనిఖీలు చేశారు. రెండు నెలల క్రితం వివిధ కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు చేసిన ఈడీ ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేయగా.. కన్సల్టెన్సీ సంస్థలు అర్హత లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లు, తప్పుడు డిపాజిట్లతో వీసాలు జారీ చేస్తున్నాయని తేలింది. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న నకిలీ కన్సల్టెన్సీ సంస్థలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. గచ్చిబౌలిలోని ASBIకి చెందిన సైడ్ అపార్ట్‌మెంట్‌లో ED సోదాలు నిర్వహించింది. అలాగే ఇంటాగ్రిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు పలు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టింది. కన్సల్టెన్సీ సంస్థల వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసిందే.
Expensive Apartment : భారత్ లోనే ఖరీదైన అపార్ట్‌మెంట్