Malla Reddy: మెడికల్ కాలేజీల్లో సీట్ల కుంభకోణంపై ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేయనున్నారు. 2016 నుంచి 2022 వరకు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు గత నెలలో రాష్ట్రంలోని ఇటీవల 16 ప్రాంతాల్లో పలు మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. ముఖ్యమైన పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని ఆరు మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 21న ఈడీ అధికారులు మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. సూరారంలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహబూబ్ నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, సమీర్ పేటలోని మెడిసిటీ కాలేజీ, చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలు నిర్వహించింది.
Read also: Wanaparthy: కస్తూర్బాలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత
2022 ఏప్రిల్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యం ముందస్తు ప్రణాళిక ప్రకారం పీజీ సీట్లను బ్లాక్ చేసి భారీ మొత్తానికి విక్రయించినట్లు కాళోజీ మెడికల్ యూనివర్సిటీ అధికారులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. మెడికల్ కాలేజీ సీట్ల కుంభకోణంలో రూ. 100 కోట్లు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై మంత్రి మల్లారెడ్డి కుమారులకు ఈడీ నోటీసులు ఇవ్వనుంది. మల్లారెడ్డి కాలేజ్ కు ఛైర్మెన్ గా భద్ర రెడ్డి , జనరల్ సెక్రెటరీ గా మహేందర్ రెడ్డి విదిలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు పలువురికి నోటీసులు ఇవ్వనుంది. వచ్చే వారం మెడికల్ కాలేజ్ యాజమాన్యాలకు ఈడి నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 2022 లో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే.