NTV Telugu Site icon

Chikoti Praveen: 15వ తేదీ రావాల్సిందే.. చీకోటికి మరోసారి ఈడీ నోటీసులు..

Chikoti Praveen

Chikoti Praveen

ED notices to Cheekoti Praveen once again: చీకోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్‌ను గతంలో ప్రశ్నించిన ఈడీ.. ఇవాల మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన తర్వాత చికోటీకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. మరో ముగ్గురికి తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇది ఇలా ఉండగాచికోటి ప్రవీణ్ శుక్రవారం ( మే12న) థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ రానున్నారు. చికోటి ప్రవీణ్ వచ్చే సోమవారం 15న ఈడీ ముందకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ కు ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారు అనే దానిపై ఆశక్తి నెలకొంది.

Read also: TS Inter results: ntvtelugu.com లో ఇంటర్ ఫలితాలు

రాజకీయాల్లోకి వస్తున్న అనే వదంతుల వల్లే ఇలా టార్గెట్ చేస్తున్నారని క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ.. చికోటి ప్రవీణ్ అడ్డంగా బుక్కైన తరువాత చికోడి ఈవ్యాఖ్యలు చేశారు. తనని టార్గెట్ చేస్తున్నారని నా తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు. కొన్ని దేశాల్లో పోకర్ టోర్నమెంట్ కి లీగల్ గా పర్మిషన్ ఉన్నాయని మండిపడ్డాడు. అక్కడికి ఒక ప్లేయర్ లాగా ఈవెంట్ కి వెళ్ళానని చికోటి ప్రవీణ్ అన్నాడు. తను రాజకీయాల్లోకి వస్తున్న అనే వదంతులు వల్లే ఇలా టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నాకు లీగల్ గా వందకు పైగా స్థానాల్లో క్యాసినో నడిపే స్థలాలు ఉన్నాయన్నాడు. 100 పోలీసులు పైగా ఈ రైడ్ లో పాల్గొన్నారన్నారని తెలిపారు.

ఈ రైడ్ లో ఓ కమిషనర్ స్థాయి అధికారిపాల్గొన్నారని అన్నాడు. తను తప్పించుకోవడానికి 50 లక్షలు ఇచ్చాను అనేది అవాస్తవమని, ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తను ఈవెంట్ ఆర్గనియాజ్ చేయలేదన్నారు. నేను హాల్ లోకి వెళ్లిన 15 నిమిషాలకే రైడ్ జరిగిందని చికోటి ప్రవీణ్‌ చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్ నాలుగు రోజులు లేదా మూడు రోజులని నాకు తెలియదన్నారు. దేవ్ , సీత నాకు ఆహ్వానం పంపడం వల్లే నేను థాయిలాండ్‌ కి వెళ్ళానని చికోటి చొప్పుకొచ్చారు. నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెప్పారని, ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెప్పారని తెలిపారు. లీగల్ అని నాకు లేఖ పంపారని, అందులో స్టాంప్ లు కూడా పంపారని చికోటి వివరించిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో చికోడికి ఈడీ నోటోసులు ఇవ్వడం పై సంచలనంగా మారింది. ఈసారి ఈడీ ఏం ప్రశ్నించనుంది అనే దానిపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.

Show comments