NTV Telugu Site icon

Anjan kumar: రేపు విచారణకు రావాలి.. అంజన్ కుమార్ యాదవ్ కు ఈడీ నోటీసులు

Anjan Kumar Yadav

Anjan Kumar Yadav

Anjan kumar: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ మరో సారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో అంజన్‌ కుమార్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమచారం. గతంలో ఈడీ విచారణకు అంజన్‌ కుమార్‌ హాజరైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.అంజన్ కుమార్ గతంలో రూ. 20 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయమై ఈడి అధికారులు ఆయనను ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే..

Read also: Helmets-Hair loss: హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? అయితే..

నేషనల్ హెరాల్డ్ ఒక వార్తాపత్రిక. దీనిని 1938లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. కొంతమంది స్వాతంత్ర్య సమరయోధులు 1937లో స్థాపించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ద్వారా ఈ పత్రికను ప్రచురించారు. దాదాపు ఐదు వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు ఆ గ్రూపులో వాటాదారులు. నేషనల్ హెరాల్డ్ పేపర్ అనతికాలంలోనే జాతీయవాద పత్రికగా గుర్తింపు పొందింది. కానీ ఆర్థిక కారణాల వల్ల 2008లో ఈ వార్తాపత్రిక సేవలు నిలిచిపోయాయి. పేపర్ ప్రచురణ కూడా ఆగిపోయింది. కానీ డిజిటల్ ప్రచురణ 2016 నుండి ప్రారంభమైంది. అయితే నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత డబ్బు అప్పుగా ఇచ్చింది. ఎజెఎల్‌కు పార్టీ ఎప్పటికప్పుడు వడ్డీ లేని రుణం ఇచ్చింది. కాబట్టి రూ. 90 కోట్లు అందించినప్పటికీ, ఈ పత్రికను 2008లో మూసివేయవలసి వచ్చింది. ఆ తర్వాత యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ 2010లో సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను టేకోవర్ చేసింది.

Read also: Children Health: పిల్లలకు ఫీవర్‌ ఉంటే తల్లిదండ్రులు ఇలా చేయకండి

ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మెజారిటీ వాటా ఉంది. మిగిలిన కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ ఉన్నారు. అయితే నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిధులు దుర్వినియోగం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు 2012లో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు పెట్టారు. సోనియా, రాహుల్ గాంధీలు వేల కోట్ల రూపాయలను మోసం చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని 2012 నవంబర్ 1న ఢిల్లీలోని కోర్టులో స్వామి ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఢిల్లీ, యూపీ తదితర ప్రాంతాల ద్వారా రూ. 1,600 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్) ఆస్తులను మోసపూరితంగా సంపాదించారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు నెలల క్రితం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ ఎదుట పలుమార్లు హాజరయ్యారు. తాజాగా అంజన్ కుమార్ యాదవ్ విచారణతో ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో సంచలనంగా మారింది.
Vote from home: ఇంటి నుంచే ఓటు.. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ అమలు