NTV Telugu Site icon

Medak Church: మెదక్ చర్చిలో ఈస్టర్ వేడుకలు.. భక్తులకు దివ్య సందేశం

Medak Church

Medak Church

Medak Church: మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. గుడ్ ఫ్రైడే నాడు శిలువపై మరణించిన యేసు ప్రభువు మూడవ రోజు సమాధి నుండి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని గుర్తు చేస్తూ పాటలు పాడారు. ఈస్టర్ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో చర్చి ఆవరణలో సందడి నెలకొంది. మెదక్ డయాసిస్ పరిధిలోని జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది.

Read also: Madhyapradesh : ఇంటిపై హైటెన్షన్ వైరు.. ఆపై సిలిండర్ పేలుడు.. ఐదుగురు సజీవదహనం

ప్రెస్ బిటరి ఇన్‌చార్జి రెవరెండ్ శాంతయ్య భక్తులకు దివ్య సందేశం ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు శిలువ ఊరేగింపుతో చర్చి ప్రాంగణంలో ఈస్టర్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులను వెలిగించి ఈస్టర్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలువను స్మరించుకున్నారు. దేవుడి పూజలు, ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణం మారుమోగింది. చర్చి ఉపాధ్యాయుల భక్తి సూక్తులు మధ్య భక్తిగీతాలు ఆలపించారు. యేసు సమాధి నుండి లేచి భక్తులకు అర్థమయ్యేలా వివరించాడు. కొంతమంది క్రైస్తవులు తమ సమాధుల వద్ద కొవ్వొత్తులను వెలిగించడం ద్వారా తమ ప్రియమైన వారిని గుర్తుంచుకుంటారు.
KCR: నేడు కేసీఆర్ జిల్లాల పర్యటన.. సూర్యాపేటలో మీడియా సమావేశం..