NTV Telugu Site icon

ఏపీ తెలంగాణ ఈ పాస్ రచ్చ… కిలోమీటర్ల మేర… 

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.  కంట్రోల్ చేయడానికి అనేక ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నా కట్టడి కావడం లేదు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.  ఉదయం 10 గంటల తర్వాత ఈ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.  ఏపీ నుంచి తెలంగాణలోకి ఎంటర్ కావాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.  అత్యవసర, అంబులెన్స్ ను మినహాయించి మిగతా వాటికీ ఈ పాస్ లు తప్పనిసరి చేసింది.  తెలంగాణ చెక్ పోస్టులు ఉన్న అన్ని చోట్ల ఈ పాస్ తప్పనిసరి.  దీంతో ఏపీ-తెలంగాణ బోర్డర్ లో పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి.