తన రాజీనామా దెబ్బకు రాష్ట్రంలో 10 క్షల మందికి పెన్షన్స్ వచ్చాయని రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా ద్వారా ప్రభుత్వంలో కదలిక మొదలయ్యిందని ఎద్దేవ చేసారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నేను పోరాడుతున్న విషయం అందరికి తెలుసని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ లను విధుల్లోకి తీసుకోవడం కూడా నా రాజీనామా ఫలితమే అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన రాజీనామా ఊరికే పోలేదని హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వ యంత్రాంగం మునుగోడుకు వస్తుందని తెలిపారు. డ్వాక్రా రుణాలపై కూడా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా ను నేను కలవగానే గట్టుపల్ మండల ప్రకటన వచ్చిందని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేది మరోసారి నా రాజీనామా ద్వారా రుజువు వైందని తెలిపారు.
స్పెషల్ డెవలప్‌మ్మెంట్ ఫండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడని ప్రభుత్వం మంజూరు చేయలేదని, తన రాజీనామా తరువాత మంజూరు చేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే లను ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంకు ముఖ్యమంత్రిని రప్పిస్తున్న ఘనత నాదే.. అంటూ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు సభ నుండి రాజగోపాల్ రెడ్డిపై ముఖ్యమంత్రి, ఎన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మరని తెలిపారు. కాంట్రాక్టు లకోసం రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. అలా అనుకుంటే పార్టీ మారిన 12మందితో కలిసి పార్టీ మారెవాడిని అంటూ తెలిపారు. నిజాయితీగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి, ఆమోదించుకున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రజల నిర్ణయం మేరకే రాజీనామా చేసానని తెలిపారు.
read also: Komatireddy Venkat Reddy: నన్ను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టే కుట్ర..! ఇక్కడే ఉంటా.. ఇక్కడే చస్తా..
తన రాజీనామా తరువాత మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు అభివృద్ధిని చూస్తున్నారని తెలిపారు. కుటుంబ పాలనకు, అరాచక పాలనకు వ్యతిరేకంగా తను పోరాటం చేస్తుంటే.. నాతో ప్రజలు కలిసి వస్తున్నారని అన్నారు. మునుగోడు లో ఫ్లోరైడ్ పోలేదని అన్నారు. 2014 కంటే ముందు నుండే కృష్ణా జలాల మునుగోడు ప్రజలు తాగుతున్నారని, జిల్లా మంత్రి కల్యాణ లక్ష్మీ చెక్కులు ఇవ్వడానికి పరిమితం అయ్యారని విమర్శించారు. అమ్ముడుపోయాయని అంటున్న వారికి నిరూపించమని సవాల్ చేస్తే.. స్పందన లేదని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక తోనే కేసీఆర్ పతనం ప్రారంభం కావడంనాకు సంతోషంగా ఉందని తెలిపారు. మునుగోడు ప్రజలు నన్ను కాపాడుకుంటారు.. కడుపులో పెట్టుకుంటారని తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికల తీర్పు తెలంగాణలో చారిత్రాత్మకంగా ఉంటుందని అన్నారు. నేతలు, ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు డబ్బు సంచులతో వస్తారని సంచళన వ్యాఖ్యలు చేసారు. కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని మండిపడ్డారు. దళితుడు సీఎల్పీ నేతగా ఉంటే ఓర్వలేక. 12 మందికి తమ పార్టీలోకి చేర్చుకొని ప్రతిపక్ష పార్టీ లేకుండా, దళితుడిని అవమానించారు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీల భవిష్యత్ కు సంబంధించిన ఉప ఎన్నిక కాదు.. తెలంగాణ ప్రజల భవిష్యత్ కు సంబంధించిన ఎన్నిక అని రాజగోపార్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.
Bhatti Vikramarka: అమృత ఉత్సవాల పేరిట బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటాలు విడ్డూరంగా ఉన్నాయి
