NTV Telugu Site icon

Telangana-Maharashtra: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి ఉధృతం..!

Penuganara River

Penuganara River

Telangana-and-Maharashtra: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కుండపోత వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో కోమరంభీం జిల్లా సిర్పూర్.టి మండలంలోని వెంకట్రాపేట్ వద్దనున్న పెనుగంగా బ్రిడ్జ్ పై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తెలంగాణ-మహారాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు అధికారులు. కాగా.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. భారీగా నీరు పెనుగంగా బ్రిడ్జ్ పై ప్రవహిస్తుండటంతో వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read also: Ahmedabad airport: అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులోకి వరద నీరు..

భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు ఏరులై పారుతున్నాయి. గాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. రేపు (24)న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మెదక్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, వరంగల్, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, వికారాబాద్, జంగం, సిద్దిపేట, హన్మకొండ, జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.
Nehru ZooPark: తగ్గేదేలే.. పుష్ప సినిమా స్టైల్ లో జూపార్క్ లో గందపు చెట్లు స్మగ్లింగ్