Rains In Hyderabad: తెల్లవారుజామున వర్షం హైదరాబాద్ ప్రజలను పలకరించింది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో నగరమంతా అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. రెండు గంటల వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే… వానాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ బెంబేలెత్తుతున్నారు. చాలా చోట్ల వర్షపు నీరు నిలిచి రోడ్లు చెరువులుగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్ పల్లి, జగత్ గిరి గుట్ట, మూసాపేట, జేఎన్‌టీయూ, నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట్, పంజాగుట్ట, శ్రీనగర్, సనత్ నగర్‌లో భారీ వర్షం కురిసింది.
కాప్రా, ఏఎస్ రావునగర్, ఈసీఐఎల్ చౌరస్తా, కుషాయిగూడ, హెచ్‌బీ కాలనీ, చర్లపల్లి, దమ్మాయిగూడ, జవహర్ నగర్, నాగారం, రాంపల్లి, కీసర, నేరేడ్‌మెట్, సైనిక్‌పురి, కుషాయిగూడ, బాలాజీ నగర్, కీసర, దమ్మాయిగూడ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. . వర్షం, దట్టమైన మేఘాలతో నగరమంతా చీకటిగా మారింది. భారీ వర్షానికి ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి. హిమాయత్ నగర్‌లో అత్యధికంగా వర్షం పడింది. హిమాయత్‌నగర్‌లో అత్యధికంగా ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సెరిలింగంపల్లిలో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మల్కాజిగిరి, ముషీరాబాద్, నాంపల్లిలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉప్పల్, ఆసిఫ్ నగర్, బాలానగర్‌లో ఐదు సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.
హైదరాబాద్‌లో రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షం ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. నాలో నాలుగో తరగతి చదువుతున్న మౌనిక అనే బాలిక మృతి చెందింది. సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న మౌనిక అనే బాలికను నల మింగేశాడు. తెల్లవారుజామున పాల కోసం వెళ్లిన ఓ బాలిక కనిపించని నీటితో నిండిన కాలువలో పడిపోయింది. ఇదంతా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమని స్థానికులు వాపోతున్నారు.. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.