Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : సమస్యలు విని.. పరిష్కారం విస్మరించింది ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. సమావేశాలు మొదటి రోజునే ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు 2022-23 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ… గబగబా సభను ఏడు రోజుల్లో ముగించారని ఆయనా ఆరోపించారు. అంతేకాకుండా సమస్యలు విని..పరిష్కారం విస్మరించింది ప్రభుత్వమని, విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేయబోతున్నారని ఆయన విమర్శించారు. ఈఆర్‌సీ ధరలు పెంపు ఆపేయాలని డిమాండ్ చేశామని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రివర్ బేసిన్‌లపై ఇచ్చిన గెజిట్ పై ఏం చేస్తారో చెప్పలేదని ఆయన మండిపడ్డారు.

ఆదాయాలు పెరుగుతున్నాయి.. ధనిక రాష్ట్రం గా ముందున్నామని చెబుతున్నారు.. కాగ్ రిపోర్ట్ ఈ రోజు సభలో ప్రవేశ పెట్టారు. 2020 లో ఆర్థిక మిగులు లేదని.. ప్రభుత్వ విధానం కరెక్ట్ లేదని తలంటిది. కాగ్.. 97 శాతం ద్రవ్యలోటు పూడ్చుకోవడం కోసం మార్కెట్ రుణాలు తీసుకొస్తుంది. విద్యకు కేటాయించిన కేటాయింపు లు చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. విద్య , ఆరోగ్యం పై ఖర్చు చేసింది తక్కువే అని కాగ్ స్పష్టం చేసిందని, బడ్జెట్ అమలు నియంత్రణ సరిగా లేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు.

Exit mobile version