NTV Telugu Site icon

Shamshabad: శంషాబాద్‌లో దుబాయ్‌ విమానం ఎమర్జెన్సీ లాండింగ్‌.. నలుగురు ప్రయాణికుల్ని దించేసిన పైలట్

Shamshabad Airport

Shamshabad Airport

Dubai flight emergency landing in Shamshabad: నార్కోటిక్ ఫోర్స్ తో వెళ్తున్న ఓ విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దుబాయ్ నుంచి కొచ్చి వెళ్తున్న విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం తాగి తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.. విమాన సిబ్బందిపైనా, ఇతర ప్రయాణికులపైనా దాడికి యత్నించారు. దీంతో పైలట్‌ విమానాన్ని దారి మళ్లించి శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. నలుగురిని భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్‌జీఏఐ స్టేషన్‌ పోలీసులు తెలిపారు.

Read also:Pushpa 2 : తప్పని తిప్పలు తెచ్చిపెడుతున్న ఐటమ్ సాంగ్..?

అయితే ఇటీవలి కాలంలో విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వివరణ గతంలో పలు విమాన ప్రయాణాల్లో చిన్న చిన్న విషయాలకే ప్రయాణికులపై పిడిగుద్దులు కురిపించిన సంగతి తెలిసిందే. మరికొందరు తోటి ప్రయాణికులకు మూత్ర విసర్జన, వాంతులు చేస్తూ ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. మరికొందరు విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మహిళా సిబ్బంది ఇలాంటి ప్రయాణికులకు మీ బానిసలు కాదంటూ ఘాటుగా సమాధానమిస్తున్నారు. తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతను పనిచేసే కంపెనీ కూడా అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే దీని తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.
Pushpa 2 : తప్పని తిప్పలు తెచ్చిపెడుతున్న ఐటమ్ సాంగ్..?