Site icon NTV Telugu

Hyderabad: నాగోల్ లో తాగి రోడ్డుపై హంగామా చేసిన జంట అరెస్టు..

Hyderabad1

Hyderabad1

Hyderabad: నాగోల్ లో ఉదయం తాగి రోడ్డుమీద హంగామా చేసిన జంటను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నడిరోడ్డు పై తాగుతూ వాకర్స్ ను ఇబ్బంది గురిచేసిన అలెక్స్ తో పాటు యువతి అరెస్టు చేశారు. తాగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్న జంటను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాగి గొడవ చేస్తున్న వాళ్లని
వాకర్స్ మందలించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. వాకర్స్ మీద తిరుగుబడిన జంట హంగామా సృష్టించి బీభత్సం సృష్టించారు. జంట హల్చల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలెక్స్ తో పాటు యువతిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. గతంలోనూ అలెక్స్, యువతి ఇదే మాదిరిగా హంగామా చేసినట్లు గుర్తించారు. అలెక్స్ తో పాటు యువతీని కూడా నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read also: Saturday Parayanam: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే బాధల నుంచి విముక్తులవుతారు..

నాగోల్‌లో ఓ వైపు మార్నింగ్ వాకర్స్ తమ పనుల్లో నిమగ్నమై ఉంటే.. ప్రేమికులిద్దరూ బీరు సీసాలు చేతిలో పెట్టుకుని కారులో భీకరమైన లౌడ్ స్పీకర్లు ఆన్ చేసి నడిరోడ్డుపై తాగుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారి చేష్టలను కొంతసేపు భరించిన వాకర్స్ మరింత శృతిమించడంతో ప్రజలు కలుగజేసుకుని ఇది పద్ధతి కాదని చెప్పిన పాపానికి జంట మరింత రెచ్చిపోయింది. వాకర్స్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

Read also: AP Crime: మదనపల్లెలో దారుణం.. వైసీపీ నేత దారుణ హత్య

అమ్మాయైతే.. బీరు సీసా చేతిలో పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ బండ బూతులు తిట్టింది. అక్కడే ఉన్న వాకర్స్.. ఈ దృశ్యాలు మొబైల్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదేం మాయరోగం అంటూ జంటపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం పెంపకం అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా నెటిజన్లు జంటపై మండిపడుతుండటం సోసల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నాగోల్ పోలీసులు స్పందించారు. వెంటనే వారిని అదుపులో తీసుకున్నారు.
Govinda Namalu: గోవింద నామాలు వింటే కోరికలు నెరవేరుతాయి

Exit mobile version