Site icon NTV Telugu

Narcotic Wing : డ్రగ్ ఫెడ్లర్‌లకు చుక్కలే..

నార్కోటిక్ వింగ్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది.. స్థానిక పోలీసుల సమన్వయంతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తూ డ్రగ్ ఫెడ్లర్ లకు చుక్కలు చూపిస్తోంది ఈ వింగ్.. తాజాగా అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డ్రగ్ ఫెడ్లర్ ఆట కట్టించింది.. డ్రగ్ ఫెడ్లర్ తో పాటు మరో నలుగురు కంజ్యుమర్లను కూడా అదుపులోకి ఈ వింగ్ అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం నార్కోటిక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్ ను ఏర్పాటు చేసింది… ఈ వింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుంటోంది.. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ వింగ్ మరియి స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. పక్క సమాచారం మేరకు రైడ్ చేసిన పోలీసులు గంజాయి నుండి తీసిన హ్యష్ ఆయిల్ ను విక్రయిస్తున్న డ్రగ్ ఫెడ్లర్ అశుతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద హ్యష్ ఆయిల్ కొనుగోలు చేస్తోన్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.. వీరి వద్ద నుండి 300 గ్రాముల హ్యష్ ఆయిల్ తో పాటు ఆరు మొబైల్ ఫోన్స్, ఓ బైక్ సీజ్ చేశారు.

ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్న అశుతోష్ హ్యష్ ఆయిల్ కు అలవాటు పడ్డాడు. దీంతో కొన్నాళ్లకు ఈజీ మనీ కోసం అతనే ఫెడ్లర్ గా మారాడు. వైజాగ్ నుండి ఈ హ్యష్ ఆయిల్ ను హైదరాబాద్ తెప్పిస్తాడు. ఈ హ్యష్ ఆయిల్ ను ఐదు గ్రాముల చొప్పున ఓ బాటిల్ ను విక్రయిస్తున్నాడు.. వైజాగ్ లో ఐదు గ్రాములను 500 నుండి 600 లకు కొనుగోలు చేసి స్థానికంగా రెట్టింపు ధరకు విక్రయిస్తాడాని నార్కొటిక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి వివరించారు

గత కొన్నాళ్లుగా అశుతోష్ ఈ దందా కొనసాగిస్తున్నాడు… దీంతో అతని స్నేహితులైన పుల్లమూరి కృష్ణ, ఖురేషి, సురేష్ , సయ్యద్ అబ్దుల్ లకు అశుతోష్ ఈ హ్యష్ ఆయిల్ ను విక్రయిస్తున్నాడు.. మరికొంతమందికి కూడా ఏ హ్యష్ ఆయిల్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం ఉండటంతో రైడ్ చేశారు.. అశుతోష్ పాటు స్నేహితులు నలుగురిని అరెస్ట్ చేశారు.. మరోవైపు నిందితుడు అశుతోష్…. లక్కీ అనే వ్యక్తి దగ్గర హ్యష్ ఆయిల్ కొన్నట్టు పోలీసుల విచారణ లో తేలడంతో అతన్ని అరెస్ట్ ప్రయత్నాలు చేస్తున్నారు. యువత మత్తుకు బానిస అవుతున్నారు.. ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు.. మరోవైపు బాధితులుగా కూడా మారుతున్నారు.. యువత మత్తుకు దూరంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా పిల్లలను పర్యవేక్షిస్తూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version