Site icon NTV Telugu

Dowry Harassment: దారుణం.. నీ కూతుర్ని చంపేసా.. మామకు అల్లుడు ఫోన్

Dowry Harassment

Dowry Harassment

Dowry Harassment: మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజు మరింతగా పెరుగుతున్నాయి. వరకట్న వేధింపులు, అనుమానం, ప్రేమ ఒప్పుకోలేదని, ఎవరితో అయినా మాట్లాడినా సహించక పోవడం, ఇలా ఏదో ఒకరూపంలో మహిళలు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచి నవమాసాలు మోసీ కనీ, పెంచీ.. తమకంటే బాగా చూసుకోవాలని మంచి వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేస్తూ అతను కాలయముడిగా మారుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటంలేదు. కట్నం ఇంకా ఎక్కువ కాలని, ఎవరితోనైనా మాట్లాడినా అనుమానంతో ఆమెపై దాడిచేసి మరీ మృత్యుఒడిలోకి పంపుతున్నారు. జీవితాంతం తోడై వుండాల్సిన భర్తే భార్యకు హత్య చేసేందుకు వెనుకడటంలేదు. చిన్న వివాదాలు, చిలికి చిలికి గాలివానయై ప్రాణాలు తీసేందుకు పాల్పడుతున్నారు. మచ్చలేని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఆతరువాత వారు చేసే పని నిస్సందేహంగా, నిర్భయంగా ఇప్పుకోవడం. ఏదో ఘనకార్యం చేసినట్లు మేమే చేసామంటూ పోలీసులకు, కుటుంబంలోని వారికి తెలపడం. ఇలాంటి దారుణమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ బ్యాంక్ కాలనీలో అనీష్ ఫాతిమా, సుల్తాన్‌ అనే భార్య భర్తలు జీవనం కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా సజావుగా కొనసాగిన వీరి కుటుంబంలో కలతలు చెలరేగాయి. అనీష్‌ ఫాతిమాకు వరకట్నం వేధింపులు మొదలయ్యాయి. అంతే కాకుండా.. ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆమెపై అనుమానంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవాదన భార్య ఫాతిమా మీదకు వచ్చింది. కోపంతో ఊగిపోయిన కషాయి భర్త ఆమెను చున్నీతో ఉరివేసి ఊపిరాడకుండా బిగించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అది చాలక ఏదో ఘనకార్యం చేసినట్లు భార్య తండ్రి, (మామకు) నీకు తుర్ని నేను చంపేసానంటూ ఫోన్‌ చేసి మరీ చెప్పాడు. షాక్ తిన్న ఫాతిమా కుటుంబ సభ్యులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసుకున్నా పోలీసులు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన కూతురు చావుకు కారణమైన సుల్తాన్‌ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
Corona Cases: దేశంలో 47వేలకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు

Exit mobile version