Hyderabad Crime: హైదరాబాద్ లోని టప్పాచబుత్ర, దైబాంగ్ లో ఇద్దరు హిజ్రాలు దారుణ హత్యకు గురయ్యారు. కత్తి, బండరాళ్లతో మోది ఇద్దరు ట్రాన్స్ జండర్లను హత్య చేశారు దుండగులు. స్థానిక సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ విడుదల చేశారు పోలీసులు. ఇందులో కిందపడుకున్న వారిని ఓ వ్యక్తి బండరాయితో మోదీ చంపడం కనిపిస్తుంది. పాత గొడవలే హత్యకు కారణమని భావిస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. హత్యకు గురైన వారు యూసుఫ్ అలియాస్ థాలి, రియాజ్ అలియాస్ సోఫియాగా గుర్తించారు. వీరిద్దరూ టప్పాచబుత్ర వాసులే కావడం కలకలం రేపుతుంది.
Read also: Flyover Collapsed: ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్ ప్రమాద ఘటన.. ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం ఎంట్రీ
మైలార్ దేవుపల్లి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దుర్గానగర్ చౌరస్తా సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను దారుణ హత్య గురయ్యారు. బండరాళ్లతో మోది దుండగులు హత్య చేసారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కాటేదాన్ లోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇద్దరిని ఒకే విధంగా బండ రాయితో మోది హత్య చేయడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. వరుస హత్యలతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం నేతాజీ నగర్ లో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపిన ఘటన తెలిసిందే.. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తులే టార్గెట్ గా దుండగులు మూడు రోజుల్లో మూడు హత్యలు చేయడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
Hair Care Tips: యవ్వనంలోనే మీ జుట్టు తెల్లబడుతోందా?.. ఈ నేచురల్ పద్దతులతో మీ సమస్యకు చెక్ పెట్టండి!
