Site icon NTV Telugu

కేబుల్ ఆపరేటర్లకు, హమాలీలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు : గంగుల

హుజురాబాద్ సిటీ సెంటర్ హల్ లో కేబుల్ ఆపరేటర్స్ – హమాలి సంఘ సభ్యులతో తెలంగాణ మంత్రి గంగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆపదలో, ఆకలితో ఉన్నవారిని ఆధుకునే మంచిమనుసు సీఎం కేసీఆర్ ది అని.. కేబుల్ ఆపరేటర్లు, హమాలీలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అర్హులైన కేబుల్ ఆపరేటర్లకు, హమాలీలకు అతి త్వరలో డబుల్ బెడ్రూం, బీమాసౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈటెల ఏనాడు హుజురాబాద్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ను అడగలేదని… నియోజకవర్గాన్ని గాలికొదిలేసారని మండిపడ్డారు. అడిగిందే తడవుగా హుజురాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తుంది తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేనేలేవని గుర్తు చేశారు.

Exit mobile version