Site icon NTV Telugu

Harish Rao: అభివృద్ధి చూడండి.. తప్పుడు ప్రచారాలు చేయకండి

Harish Rao

Harish Rao

Harish Rao: అభివృద్ధి చూడండి.. తప్పుడు ప్రచారాలు చేయకండని మంత్రి హరీష్‌ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో హరీష్ రావు పర్యటించారు. బోనాల కెనాల్ లోకి సాగు నీటి కోసం గోదావరి నీటిని విడుదల చేశారు. కేసీఆర్‌ ముఖ్య మంత్రి కాకపోతే గోదావరి నీరు చేగుంటకు రాకపోతుండే కదా? అని ప్రజలను ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రాజెక్టులు కడుతున్నారని.. వాళ్ళు అడ్డుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ రైతుల మోటర్లకు మీటర్లు పెడతా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ల ద్వారా రైతుల పొలాలకి నీరు ఇస్తున్న కేసీఆర్‌ కావాలా… అడ్డుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ కావాలా? అని ఆలోచించండని మంత్రి తెలిపారు. కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కంటి ముందు కనిపించే అభివృద్ధి చూడండి అని మంత్రి అన్నారు.

Read also: Hyderabad Job Fraud: ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్

కాకతీయ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని భావి తరాలకు అందించేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో కాకతీయుల కాలం నాటి నాణేల చరిత్ర, ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రముఖ నాణేల అధ్యయన నిపుణుడు డాక్టర్ రాజిరెడ్డి రచించిన ‘కాకతీయ నాణేలు’ పుస్తకాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. మిషన్ కాకతీయ పేరుతో 46 వేలకు పైగా చెరువులకు జీవం పోసి కాకతీయ రాజ్యాన్ని పాలించిన పాలకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు.
Ravinuthala Govardhan Sharma: సమాచార హక్కు కార్యకర్తల సంఘం జిల్లా కన్వీనర్‌గా గోవర్ధన్ నియామకం

Exit mobile version