Dogs Attack: తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు హడలెత్తుస్తున్నాయి. నిన్న అంబర్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన మరువక ముందే మరో ఇద్దరు చిన్నారులపై కుక్కలదాడి భయాందోళన కలిగిస్తుంది. బయట చిన్నారులు కనిపిస్తే చాలు వారిపై కుక్కలు ఎగబడి దాడి చేసి తీవ్రగాయాలు చేస్తున్నాయి. నిన్న అంబర్ పేట్ చిన్నారిపై సునకాల దాడి.. ఇవాల మరో రెండు చోట్ల చిన్నారులపై అతి కిరాతకంగా కుక్కలు దాడులు చేసాయి. వీధిలో ఆడుకుంటున్న చిన్నారులపైనే కాకుండా ఇప్పుడు ఏకంగా హాస్టల్లో చొరపడి అభం సుభం తెలియని పసి పిల్లలపై కుక్కల దాడులు తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది.
నగరంలోనే మరో ఘటన..
హైదరాబాద్ లోని చైతన్య పురి మారుతి నగర్ కాలనీలో నాలుగు సంవత్సరాల బాలుడిపై కుక్కలదాడి చేశాయి. కాలనీలో బాలుడు ఆడుకుంటున్న సమయంలో అతనిపై కుక్కలు ఎగబడ్డాయి. దీంతో ఆబాలుడు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే వున్న స్థానికులు కుక్కలను తరమికొట్టారు. దీంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. బాలున్ని చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళ చెందుతున్నారు. ఎన్నోసార్లు మున్సిపాలిటి వెటనరి వాళ్లకు పిర్యాదు చేసిన చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాలనీ వాసులను కుక్కలు వెంబడించి భయభ్రాంతులు చేశాయని అప్పుడు కూడా ఫిర్యాదు చేసి కుక్కలను పట్టించిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. కొంతమంది కాలనీ వాసులు వాటిని విడిపించి, వాటికి ఆహారం వేస్తు కాలనీలోకి వదలడం వల్లనే నా కన్న బిడ్డపై కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో వున్న కుక్కల బెడదను లేకుండా చేయాలని బాలుడి తల్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని.
హాస్టల్లో చొరబడి దాడి..
ఇలాంటి ఘటనే కరీంనగర్ లో ఎస్సీ హాస్టల్లో చోటు చేసుకోవడం తీవ్ర దిగ్భాంతిని గురిచేసింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం ఎస్సీ హాస్టల్లోకి చొరబడి వీధి కుక్కలు విద్యార్థిని గాయపరిచాయి. ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి మంగళవారం రాత్రి వీధి కుక్క చొరబడింది. హాస్టల్లో వున్న సుమంత్ అనే ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిపై కుక్క ఎగబడింది. దీంతో సుమంత్‌కు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అతనిపై ఎగబడి తీవ్రంగా గాయపరిచింది. సుమంత్ గట్టిగా కేకలు వేయడంతో హాస్టల్ సిబ్బంది, స్థానికులు పరుగున వచ్చి సుమంత్ ను వీధికుక్కనుంచి కాపాడారు. తక్షణమే108కి ఫోన్ చేయడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుని కుక్కదాడిలో గాయాలైన విద్యార్థిని కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రెండు రోజుల నుంచి చిన్నారులపై కుక్కల దాడి కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిలించింది. నగర వీధిల్లోనే కాకుండా జిల్లాలోని హాస్టల్ల వరకు పాకడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో కుటుంబ సభ్యులు తమ కంటి ముందు వున్న చిన్నారులను ఒక్కక్షణంలో కోల్పోవల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Marakata Ganapati Stotra: బుధగ్రహ నివారణకు మరకత గణపతి స్తోత్రం వినండి