బాన్సువాడ బీజేపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇంటిపై బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడుతో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ. రాత్రి నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యులతో పాటు, డ్రైవర్‌పై దాడి చేసి భయాందోళన సృష్టించి ఎన్నికలలో గెలవాలని చూడడం పిరికిపందల చర్య అన్నారు. ఓటమి భరించలేక దాడులకు తెగబడుతున్న బీఆర్ఎస్ గుండాల్లారా మీ ఆటలు ఇక సాగవు అని అని ఆమె ధ్వజమెత్తారు. ఒక అభ్యర్థి ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం సిగ్గుచేటు చర్య అన్నారు. బాధ్యతగల అసెంబ్లీ స్పీకర్ అయి ఉండి.. ఓ ఫ్యామిలీ ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణ ఇంటిపైకి వెళ్లి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే బీజేపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణకు భద్రతను కల్పించాలని, ఆయపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
DK Aruna: యెండల లక్ష్మీనారాయణపై దాడి.. తీవ్రంగా ఖండించిన డీకే అరుణ
Show comments