Site icon NTV Telugu

DK Aruna : బండి సంజయ్‌పై పాదయాత్రపై క్లారిటీ..

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో విడత ఈ నెల 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ పాదయాత్రపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమార్ 14వ తేదీ నుండి జోగులంబ అమ్మవారి ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. అక్కడే అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పాదయాత్రను ప్రారంభిస్తారని ఆమె పేర్కొన్నారు.

అలంపూర్ నుండి గద్వాల, మక్తల్, నాగర్ కర్నూల్, మహేశ్వరం, ప్రాంతాల మీదుగా పాదయాత్ర ఉంటుందన్నారని ఆయన వెల్లడించారు. ఈ యాత్రలో బీజేపీ అభిమానులు, కార్యకర్తలు, వివిధ సంస్థలకు చెందిన సంఘాలు పాల్గొనాలని సూచించారు. దళితుల మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వంనాకు వ్యతిరేకంగా అన్ని సంఘాల కలసి రావాలని విజ్ఞప్తి చేసారు. నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ధ్యేయముగా ముందుకు వెళ్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version