NTV Telugu Site icon

Munugodu Polling: మునుగోడులో ఓవైపు పోలింగ్‌ … మరోవైపు పంపింగ్‌

Palvai Sravanthi

Palvai Sravanthi

Munugode by Poll: మునుగోడులో పోలింగ్ ఉదయం 7గంటల నుంచి మొదలైంది. మునుగోడులో ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైంది. అయితే.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టిన కొన్ని చోట్ల నోట్ల కట్టలు మాత్రం పట్టుబుడుతున్నాయి. చండూరులో ఓటర్లకు డబ్బులు పంపిణీకి యత్నంచిన కొందరిని  గుర్తించారు పోలీసులు. వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులను చూసి డబ్బులు వదిలి అక్కడనుంచి కొందరు నాయకులు పరారయ్యారు. ఘటనాస్థలిలో రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక నాంపల్లి మల్లప్పరాజుపల్లిలో రూ.10లక్షలు పట్టుకున్నారు పోలీసులు నగదు తరలిస్తున్న కారును, బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు నగదు తరలిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక చండూరులో పురపాలికలోనూ నగదును పట్టుకున్నారు అధికారులు. బ్యాగులో తరలిస్తున్న నగదును బీజేపీ కార్యక్తలు పట్టుకున్నారు. అయితే మునుగోడులో ఓటర్లుకు 20వేలు పంపిణీ చేస్తున్నాట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుండి. ఒక వ్యక్తికి ఎన్వలప్‌ కవర్‌లో రూ.20 వేలు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్ లో వేరే ప్రదేశాల నుండి వచ్చిన వారు ఫంక్షన్ హాల్ లో ఉన్నారని తెలుసుకున్న అబ్జర్వర్ అక్కడకు చేరుకున్నారు. పుట్టపాక ఫంక్షన్ హాల్ లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారుగా గుర్తించారు. అక్కడ వారిని అదుపులో తీసుకుని వారితో పాటు మండుబాటిళ్లు, డబ్బులను సీజ్ చేశారు. వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారు ఎక్కడి వారు ఎందుకు ఇక్కడకు వచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మర్రిగూడలో బీజేపీ నాయకుల ఆందోళన చేపట్టారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆరోపించారు. గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు మర్రిగూడలో ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. పోలింగ్‌ నిలిపివేయాలంటూ పోలీసులతో బీజేపీ శ్రేణులు వ్యాగ్వాదానికి దిగారు. సిద్దపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు బీజేపీ కార్యకర్తలు అప్పగించారు. వీడియోలు తీస్తున్నామనే నెపంతో బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బీజేపీ శ్రేణులు అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగారు కార్యకర్తలు. దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటివరకు 11.20% ఓటింగ్ నమోదైంది. ఉప ఎన్నికలో 2,41,855 మంది ఓటు వేయనున్నారు. ఇక చండూరులో మండలం కొండాపూరంలో పోలింగ్‌ నిలిపివేశారు అధికారులు. ఈవీఎంలు మొరాయించడంతో అరగంట నుంచి పోలింగ్‌ నిలిచింది.

మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఓటువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

 

నల్గొండ చండూరు మండలంలో ఇడికూడలో 173వ పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చండూరులోని పోలింగ్‌ కేంద్రాలను రాజగోపాల్‌ రెడ్డి పరిశీలించారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.