హైదరాబాద్ పాత బస్తీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చిన్న అంశంపై చెలరేగిన వివాదం ఏకంగా ఇద్దరి వ్యక్తులపై కత్తులతో దాడి చేసే స్థాయికి చేరింది.
మహ్మద్ అజర్ అనే వ్యక్తి చాంద్రయాన్ గుట్ట పాత పోలీస్ స్టేషన్ సమీపంలో గదిని అద్దెకు తీసుకొని ఓగోదామ్‌ను నిర్వహిస్తున్నారు. గోదామ్‌కు సామాన్లను చేరవేయడానికి రోజూ ఆటో వస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అదే కాలనీకి చెందిన వాహేద్ అనే వ్యక్తి ఆటో గల్లీలోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలో.. నిన్న (మంగళవారం) రాత్రి 8 గంటల సమయంలో అజర్ ఇద్దరు కుమారులు మహ్మద్ గులామ్ అక్బర్, మహ్మద్ గులాగ్ అస్‌ఘర్‌లతో మరోసారి వాగ్వాదానికి వాహేద్ దిగాడు. తన ఇంటి ముందు నుంచి ఆటో ఎలా వెళుతుందంటూ ఇద్దరు సోదరులతో వాగ్వాదానికి దిగాడు. ఆటో కారణంగా రోడ్ బ్లాక్ అవుతుందంటూ వాహేద్ దుర్భాషలాడాడు. దీంతో వాహేద్‌ను అక్బర్, మహ్మద్ లు వాహేద్ తో వారించారు. కోపంతో వూగిపోయిన వాహిద్ ఇంట్లోకి వెళ్లిన కత్తి తీసుకొచ్చి ఇద్దరు సోదరులపై దాడి చేశాడు. అక్బర్, మహ్మద్ లు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు సోదరులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాధితులు అక్బర్, గులామ్ అస్‌గఘర్ సంతోష్ నగర్‌లో డిగ్రీ చదువుతున్నారు. ఇక కత్తితో దాడి చేసిన వాహేద్ ఇటీవలే విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?