Site icon NTV Telugu

Hyderabad: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు నేటితో తొమ్మిదేళ్లు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్లను బాధిత కుటుంబ సభ్యులు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. వెంకటాద్రి థియేటర్ వద్ద, కోణార్క్ థియేటర్ వద్ద చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో 17 మంది మరణించారు. సైకిల్‌పై టిఫిన్ బాక్సులో ఉగ్రవాదులు బాంబులు పెట్టడంతో సంభవించిన ఈ పేలుళ్లలో 130 మందికి పైగా గాయపడ్డారు.

ఈ పేలుళ్లకు కారణమైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, జియా ఉర్ రెహ్మాన్‌కు ఎన్‌ఐఏ కోర్టు 2016లో ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కానీ ఇంతవరకు అమలు చేయలేదు. యాసిన్‌ భత్కల్‌ భారత్‌లో అనేక పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. భత్కల్‌పై దాఖలు చేసిన చార్జిషీట్ల ప్రకారం.. 2008 అనంతరం జరిగిన కనీసం 10 బాంబు పేలుళ్లకు ఆయన ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Exit mobile version