NTV Telugu Site icon

40 లక్షలు విలువ చేసే వజ్రాలు, జాతిరత్నాలు చోరీ

హైదరాబాద్ లోని ఓ నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకువచ్చారు. మురళీకృష్ణకు హైద‌రాబాద్‌లో మూడు ప్రాంతాల్లో వజ్రాలు, జాతిరత్నాల దుకాణాలు ఉన్నాయి. కాగా, ముధురానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న ముర‌ళీకృష్ణ.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అక్క‌డే వజ్రాలు, జాతిరత్నాలు విక్రయిస్తున్నాడు. ఈ క్ర‌మంలో మిగిలిన వజ్రాలు, జాతిరత్నాలను ఇంట్లోనే ఉంచి ఆయ‌న బ‌య‌ట‌కు వెళ్లాడు. మురళీకృష్ణ ఇంట్లో దాదాపు రూ.40 లక్షలు విలువ చేసే వజ్రాలు, జాతిరత్నాలను దొంగ‌లు కాజేశారు. ప‌లువురు అనుమానితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.