NTV Telugu Site icon

Sandra Venkata Veeraiah: కావాలనే పోడుపై ధర్నాలు.. సండ్ర సీరియస్‌

Sandra Venkata Verayya

Sandra Venkata Verayya

Sandra Venkata Veeraiah: కావాలనే కొంతమంది పోడు పై ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఫైర్‌ అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లక్ష్మీ ప్రసన్న పంక్షన్ హాల్ లో చెక్కుల పంపిణి కార్యక్రమంలో సండ్ర పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదాలను ఆదుకొవాలని ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమం సీఎం కేసిఆర్ చెపట్టారని అన్నారు. గతంలో చాలా ప్రభుత్వాలు పాలించిన ఎప్పుడూ ఈ విధంగా పేదలను అదుకొనే ప్రయత్నం చెయ్యలేదని అన్నారు. పేదరికం నిర్మూలించే విధంగా గత ప్రభుత్వాలు ఎందుకు కృషి చెయ్యాలేదు? వారిని నిలాదియ్యాలి? అని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసం కొంతమంది కొత్త కొత్త ఎత్తుగడలతో మన ముందుకు వస్తున్నారని అన్నారు.

Read also: New Parliament Building: కొత్త పార్లమెంటు భవనంలో స్మార్ట్ టెక్నాలజీ.. ఎక్కడా పేపర్ కనిపించదు

తెలంగాణ ప్రభుత్వం చెపట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటింకి వివరించే బాధ్యత నాయకులు కార్యకర్తలదే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ఉత్సవాలు ఘనంగా జరపాలని సూచించారు. వచ్చె నెలలో పోడు దారులకు పట్టాలు ఇవ్వాలని కేసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. అయితే ఈ రోజు కావాలనే కొంతమంది పోడు పై ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామలు వేదికగా చేసుకొని నాయకులు కార్యకర్తలు పని చెయ్యాలని తలిపారు. ఎదైతే తెలంగాణ ప్రభుత్వం హామి ఇచ్చిందో అది చేసి ఓట్లు కు వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఎవ్వరైనా హామీలు నేరవేర్చారా? అంటూ ప్రశ్నించారు.
BSc Nursing Notification: ఆర్టీసీ దవఖానాలో బీఎస్సీ నర్సింగ్‌.. అడ్మిషన్లు షురూ