Site icon NTV Telugu

Mulugu: మాకు వైన్ షాప్ కావాలి.. ఊరు ఊరంతా కలిసి ధర్నా

Mulugu

Mulugu

Mulugu: మా ఉరిలో మద్యం షాపులు బంద్ చేయాలని స్ట్రైకులు, ధర్నాలు, నిరసలు చేస్తుంటారు. ఎందుకంటే మద్యానికి బానిసలై పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. పగలు, సాయంత్రం అని తేడా లేకుండా మద్యం సేవించి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. మద్యం మత్తులో పలువురు ఎదుటి వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఉద్దేశ్యంతో చాలా మంది మద్యం దుకానాలు ఉళ్లలో వుండకూడదని ధర్నాలు నిర్వహిస్తుంటారు. కానీ ఒక ఊరిలో మద్యం షాపులు కావాలంటూ ధర్నా చేసిన ఘటన సంచలనంగా మారింది. తమ గ్రామంలో కూడా మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటూ గ్రామస్థులు ఏకంగా తీర్మానమే చేశారు. ఇది ఎక్కడో కాదు.. మొన్న వర్షాలతో కకావికలమైన ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో.

Read also: Farmers Loan: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. నేటి నుంచే రుణమాఫీ..

మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయా గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సభలో.. ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటు అనే అంశానికి ఆమోదం తెలుపుతున్నట్లు చేతులు పైకెత్తి వారి నిర్ణయాన్ని తెలియజేశారు. అయితే హైకోర్టు స్టే విధించడంతో గత ఐదేళ్లుగా మండలంలో మద్యం దుకాణాలు లేవు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా విన్నవించనున్నారు. ఇక.. తెలంగాణలో మద్యంపై ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది. మద్యం ప్రియులను నిరాశపరచకుండా ప్రభుత్వం కూడా వారికి తగ్గట్టుగా కీలక నిర్ణయాలు తీసుకుని ఖజానా నింపుకుంటోంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో మద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. గౌడ కులస్తులతో పాటు ఎస్సీ, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇప్పటి వరకు మద్య నిషేధం.. మద్యం షాపుల ఎత్తివేతపై తీర్మానాలు చేస్తే.. ఇప్పుడు వైన్ షాపు ఏర్పాటుకు తీర్మానాలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Exit mobile version