Site icon NTV Telugu

తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావుకు కరోనా పాజిటివ్‌

తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఎప్పుడూ… రాష్ట్ర ప్రజల్ని అలెర్ట్ చేసే డీహెచ్ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రజలకు కరోనా ముందు జాగ్రత్తలు చెప్పే డీహెచ్ శ్రీనివాస్ రావుకు స్వల్ప స్థాయి లక్షణాలు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోవడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Read Also: మానవత్వం లేని మనిషి.. కేసీఆర్ : బండి సంజయ్‌..

కాగా తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వైద్యాధికారులతో పాటు డీహెచ్ కూడా పలు ఆస్పత్రుల్లో పర్యటించారు. జిల్లాల్లో కూడా పర్యటనలు చేశారు. దీంతో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే డీహెచ్‌కు కరోనా సోకిందని తెలుస్తోంది. అయితే స్వల్ప లక్షణాలు ఉండటంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోవాలని డీహెచ్‌ శ్రీనివాసరావు సూచించారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు.

Exit mobile version